సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి కందుల దుర్గేష్

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగినా, ఈవీఎంల ద్వారా జరిగినా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ కూడా అసెంబ్లీకి రావడం లేదని కందుల దుర్గేష్ విమర్శించారు. కాగా, వచ్చే జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్