AP: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రిజర్వేషన్ల ఆధారంగా అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వర్గ విభేదాలు పక్కన పెట్టి, కలిసికట్టుగా పని చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.