స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: పవన్ కళ్యాణ్

AP: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎన్డీయేలోని మూడు పార్టీలతో ప్రతినెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కూటమి పార్టీలు సమష్టి ఆలోచనలతో ఒకే గళం వినిపించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జనసేన తరఫున త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయాలని, దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలో తెలియజేయనున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్