AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణ చెప్పాలని సంఘాలు డిమాండ్ చేశాయి. డాక్టర్ సుధాకర్ మరణానికి జగనే కారణమని, మాస్క్, పీపీఈ కిట్ అందించలేక ఆయనను బలిగొన్నారని ఆరోపించాయి. మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని విమర్శించాయి. డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.