AP: మంగినపూడి బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌లో సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను ఆయన ప్రారంభించారు. వేద పండితులు ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సముద్ర స్నానం ఆచరించారు. మచిలీపట్నంలో సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.