AP: కల్తీ మద్యం కేసుపై మంత్రి పార్థసారథి స్పందించారు. ఈ నేరానికి పాల్పడినవారు ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కల్తీ మద్యం వ్యాపారం వైసీపీ నేతల ప్రోద్బలంతోనే చేశామని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెప్పాడన్నారు. ఈ కేసులో టీడీపీ వాళ్లు ఉన్నారని తెలియగానే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, వైసీపీలాగా తప్పుడు పనులు చేసే వాళ్లను తమ పార్టీలో ఉంచుకోమని మంత్రి స్పష్టం చేశారు.