పెనుగొండలోని కెనాల్ రోడ్లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి దొడ్డిపట్ల బసవయ్య సన్స్ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమంతో ముగిశాయి. వేలాది మంది భక్తులు పాల్గొని, వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ టెంట్, నీటి సరఫరా ఏర్పాట్లు చేశారు.