పెనుగొండలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు బుధవారం సాయంత్రం ముగిశాయి. చెరుకువాడ కోటిపల్లి వారి వీధిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాల ముగింపు సందర్భంగా, పెనుగొండ, చెరుకువాడ గ్రామాల్లో అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమం జరిగింది. వివిధ బ్యాండ్ మేళాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, బాణాసంచా కాల్పుల నడుమ జరిగిన ఈ ఊరేగింపును వేలాది మంది భక్తులు తిలకించారు.