గణపతి నవరాత్రి: పెనుగొండలో చవితి దుకాణాల్లో కిటకిటలాట

శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పెనుగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన చవితి దుకాణాలలో కొనుగోలుదారులు కిటకిటలాడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు వ్యాపారాలను దెబ్బతీస్తాయని దుకాణదారులు భయపడినప్పటికీ, పెద్దగా వర్షం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పత్రి, ఫలాలు, వెలక్కాయలు, సీతాఫలాలు, పువ్వులు, చెరుకు గడల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. చిన్న వెలక్కాయ కూడా 25 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్