ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీనితో ఆచంట మండలంలోని పెదమల్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఏటిగట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై, లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.