పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో గృహ యజమానులు, వాహనదారులు, ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నరసాపురం-నిడదవోలు రోడ్డుపై మంచు దుప్పటిలా కప్పడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వాహన డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.