గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పోడూరు మండలం పెమ్మరాజు పోలవరం గ్రామంలో వరి చేలు నీట మునిగిపోయాయి. స్వర్ణ బియ్యం పండి, మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులు, కోత దశలో ఉన్న పంటను వర్షాల వల్ల కాపాడుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధాన్యం గింజలు నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.