పెనుగొండలోని కోడిపందాల దిబ్బ కాలనీలో పాములు స్వైర విహారం చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, మొక్కలు పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోని వారి స్థలాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని, అలాగే వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అధికారులను, పంచాయతీ పాలకవర్గాన్ని కోరుతున్నారు.