పెనుగొండలో గణపతి నిమజ్జనం.. భారీ ఊరేగింపుతో భక్తుల కోలాహలం

పెనుగొండ పట్టణ వ్యాప్తంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు ఆదివారం గణనాథుల నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పట్టణంలో నెలకొల్పిన గణనాథులను బ్యాండ్ మేళాలు, గరగ నృత్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పెద్దలు, పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెనుగొండలో ఏర్పాటు చేసిన దాదాపు అన్ని విగ్రహాలను ఆదివారం రోజే నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్