పెనుగొండలో భారీ వర్షం: జనజీవనం స్తంభించింది

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, విద్యార్థులు, ప్రయాణికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, అనుకోకుండా కురిసిన ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే, వ్యాపార సమయాల్లో వర్షం కురవడం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని వ్యాపారులు, సంచార వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్