పెనుగొండ: దసరా సెలవులకు వెళ్లి బాలిక మృతి

పెనుగొండ మండలం నడిపూడి గ్రామానికి చెందిన బాలిక(4) దసరా సెలవులకు కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చింది. జ్వరంతో పాటు వాంతులు కావడంతో శుక్రవారం రాత్రి అమలాపురంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం అపస్మారక స్థితికి చేరుకుని మృతిచెందింది. వైద్యం వికటించడంతోనే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఊపిరితిత్తుల్లోకి ఆహారం వెళ్లడం వల్ల బాలిక మృతి చెందిందని అవసరమైన వైద్య సేవలు అందించామని ఆసుపత్రి డాక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్