పోడూరు మండలం జిన్నూరుకు చెందిన పాఠశాల వ్యాను చోదకుడు కిలారి శ్రీను, ఈ నెల 7న చించినాడ వద్ద గోదావరిలో దూకి గల్లంతయ్యారు. మిత్రులు, బంధువులు, పోలీసులు గాలించగా మంగళవారం అంతర్వేది మండలం గొందిలో అతని మృతదేహం లభ్యమైంది. శ్రీనుకు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.