ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఆయన సేకరించారు.