భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు చెప్పారు. ఈనెల 26న ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు గుర్తు తెలియని వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా అధికారులు 108 అంబులెన్స్ లో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94407 96632, 94407 96633 సంప్రదించాలని అన్నారు.