చింతలపూడి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న 27 మందికి రూ. 12,82,307 నగదుకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్