చింతలపూడి హయాగ్రీవ స్కూల్ లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కలిసి కొద్దిసేపు సందడి చేశారు.