కామవరపుకోట: రేపు జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు

ఏలూరు జిల్లా స్థాయి సీనియర్ మెన్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు నవంబర్ 2వ తేదీ నుంచి కామవరపుకోట హైస్కూల్లో ఉదయం 9 గంటలకు జరుగుతాయని పీడీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. పాల్గొనే క్రీడాకారులు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకురావాలి. మరిన్ని వివరాలకు పీడీ ఎం. సుబ్బారావును 9493339424 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్