ప్రవీణ్ కుమార్ మృతదేహం పోస్టుమార్టం: ఎమ్మెల్యే ఆదేశాలు

ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న భారతి ట్రావెల్స్ బస్సు లింగపాలెం మండలం జూబ్లీ నగర్ టర్నింగ్ వద్ద బోల్తా పడిన ఘటనలో మరణించిన వీరంకి ప్రవీణ్ కుమార్ (24) మృతదేహాన్ని చింతలపూడి మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్పరాజుగూడెం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మేడికొండ ప్రసాద్, పోస్టుమార్టం విషయమై శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ కు ఫోన్ లో సమాచారం అందించారు. గౌరవ శాసన సభ్యులు వెంటనే చింతలపూడి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్స్ కొండ్రు దేవా మరియు గుమిశెట్టి భారతిని ఫోన్ లో సంప్రదించి, త్వరగా హాస్పిటల్ కి వెళ్లి పోస్టుమార్టం జరిగేలా చూడాలని, అప్పటివరకు వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల కోసం అవసరమైనప్పుడు ఏదైనా చేయటానికి ముందుకు రావాలని సూచించారు. మేడికొండ ప్రసాద్ కు ఏదైనా అవసరమైతే ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చని తెలిపారు. అర్ధరాత్రి కూడా స్పందించిన శాసనసభ్యులకు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్