దెందులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు - గుండుగొలను మార్గంలో జరిగిన ఈ ఘటనపై దెందులూరు ఎస్ఐ శివాజీ విచారణ చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్