పెదవేగి మండలం జానంపేటలో శుక్రవారం జరిగిన "సుపరిపాలనలో - తొలి అడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, పథకాల అమలుపై ఆరా తీశారు.