ఏలూరు రూరల్ పరిధిలోని రాజేశ్వరి నగర్కు చెందిన సుధీర్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఈనెల 25వ తేదీన పార్క్ చేసిన బుల్లెట్ బైక్ తెల్లవారుజామున కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై బాధితుడు శనివారం ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.