ఏలూరు: అర్జీలు రిపీట్ కాకూడదు: ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన పౌరుల ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అర్జీలు పునరావృతం కాకుండా, ఒక్కసారి వచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించి పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్