పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో మొంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం, నూనె, చక్కెర పంపిణీని ప్రారంభించింది. తుఫాన్ వల్ల ధాన్యం, సరుకులు నష్టపోయిన ప్రజలు పెద్ద సంఖ్యలో రేషన్ షాప్ వద్దకు తరలిరావడంతో భారీ రద్దీ ఏర్పడింది. డీలర్లకు పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు సజావుగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.