వివాహిత ఆత్మహత్యాయత్నానికి కారకులైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్తూరులోని నం.1 పాఠశాల ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కుటుంబానికి ఇందిరమ్మ కాలనీలో స్థలం కేటాయించడంతో ఇల్లు నిర్మించుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో సదరు స్థలంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలకు ఉపక్రమించడంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేధింపులకు గురిచేసిన వ్యక్తితో పాటు మరో అయిదుగురిపై కేసు నమోదైంది.