నరసాపురం: డీఎస్పీ శ్రీవేదకు అరుదైన గౌరవం

నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేదకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 31న గుజరాత్లోని కెవాడియా వద్ద నిర్వహించే 'ఏకతా దివాస్ పరేడ్'లో ఏపీ పోలీస్ బృందానికి ఆమె నాయకత్వం వహించనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్రం ఈ పరేడ్ను నిర్వహిస్తోంది. ఆమె అసామాన్య సేవాభావం, క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ నైపుణ్యాలను గుర్తించి ఉన్నతాధికారులు ఈ బాధ్యతను అప్పగించారు.

సంబంధిత పోస్ట్