నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన సినీ గాయకుడు గోగులమండ రాజు (43) శుక్రవారం రాత్రి హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. 'లక్ష్మీ' సినిమాలో 'తార తళుకు తార' పాటతో పాపులర్ అయిన రాజు, 'పాడుతా తీయగా' కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయన ఆకస్మిక మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్, పలువురు నాయకులు సంతాపం తెలిపారు. శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సోదరుడు సురేశ్ తెలిపారు.