నరసాపురం మండలం తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన బంగారు షాపు దొంగతనం కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం, దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. పోలీసులు మొత్తం 666 గ్రాముల బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.