కార్తీక పౌర్ణమి సందర్భంగా, పేరుపాలెం, కేపీ పాలెం బీచ్‌లలో స్నానాలకు వచ్చే పర్యాటకులకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మెరైన్ సీఐ ఎ. నవీన్ నరసింహ మూర్తి తెలిపారు. DIG, అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు అంతర్వేది మెరైన్, మొగల్తూరు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యాటకులను నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాదకరంగా లోపలికి వెళ్లవద్దని పోలీసులు కోరారు.