జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిమ్మల

తుఫాన్ బాధితులైన రైతులకు అన్యాయం చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే వారి వద్దకు వెళ్లాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం కట్టుపాలెంలో మత్స్యకారులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తుఫాన్ల సమయంలో జగన్ రైతులను పరామర్శించిన తీరుపై తీవ్రంగా విమర్శించారు. అన్యాయం చేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని రైతులకు క్షమాపణ చెబుతారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్