మండలంలోని కుంతలగూడెం గ్రామ ప్రజల మినరల్ త్రాగు నీరు ప్లాంట్ ఆకాంక్ష నెరవేరబోతుంది. ఇందుకు సంబంధించిన పనులకు సోమవారం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన పనులను కొబ్బరి కాయ కొట్టి ఆయన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పులి నాగలక్ష్మితో కలిసి ఆయన పనులు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడో జరగవలసిన ఈ పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రజలకు అందించాలని అధికారులకు, కాంట్రాక్టర్లను ఎంపీపీ ఆదేశించారు.