తాడేపల్లిగూడెం పట్టణంలోని 36 వార్డులలో, మండలంలోని 53 గ్రామాల్లో ప్రతినెల శనివారం వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పింఛన్లను అందిస్తున్నారు. ఉదయం 10 గంటలకే 50% పంపిణీ పూర్తయింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సాయంత్రం 4 గంటలలోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎం.డి.ఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, విఆర్ఓలు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.