తాడేపల్లిగూడెం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ సుంకర ఆల్వార్ దాస్ జయంతి సందర్భంగా, శుక్రవారం ఉదయం తాడేల్లిగూడెంలో ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ భవన్ వద్ద క్లబ్ నాయకులు, సభ్యులు ఆళ్వార్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు ప్రవా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని, ఆళ్వార్ దాస్ సేవలను కొనియాడారు.