తాడేపల్లిగూడెం, ఎల్. అగ్రహారం పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం ఉరుములతో కురిసింది. ఉదయం నుంచి ఎండతో, ఉక్కపోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారి మేఘావృతమైంది. 1:30 గంటల సమయంలో వర్షం ప్రారంభమై కొంతసేపు కొనసాగింది. ఈ అకాల వర్షం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.