తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎస్వీ రంగారావు సర్కిల్ వద్ద నూతనంగా ప్రారంభం కానున్న రైతు బజార్ ఏర్పాట్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ రైతు బజార్ రైతులకు సౌకర్యవంతమైన విక్రయ వేదికగా, వినియోగదారులకు తాజా పంటలను నేరుగా అందించే వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ రైతు బజార్‌ను సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు.