అల్పపీడన ప్రభావంతో తాడేపల్లిగూడెం ప్రాంతంలో సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుని అరగంటపాటు జోరుగా వర్షం కురిసింది. ఈ సమయంలో మార్కెట్ కు వచ్చిన వారు, ప్రయాణాలలో ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.