అన్నవరప్పాడు జాతీయ రహదారి పక్కన కోనేటి వద్ద ఉన్న స్పటిక లింగం స్పర్శ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సంవత్సరంలో మూడుసార్లు మాత్రమే ఈ అరుదైన స్పర్శ దర్శనం కలుగుతుందని, మిగతా సమయాల్లో కోనేరు నీటితో నిండి ఉంటుందని ఆలయ నిర్వహకులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రత్యేక క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు.