తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైక్లిస్టుతో పాటు పలువురు విద్యార్థులు గాయాలయ్యారు. గురజాడ స్కూలు విద్యార్థులను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి సైక్లిస్టును ఢీకొట్టి, బోల్తా కొట్టింది. పోలియో కారణంగా డ్రైవర్ అదుపు తప్పినట్లు స్థానికులు తెలిపారు.