ఆకివీడు మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గానికి మోడుపల్లి ప్రసాద్ శనివారం మాదివాడలోని కోదండరామాలయంలో నియామక పత్రాలు అందజేశారు. బొల్లా వెంకట్రావు చైర్మన్‌గా, గౌరలక్ష్మి వైస్ చైర్మన్‌గా, ఇతరులకు డైరెక్టర్ హోదాలో పత్రాలు అందించారు. మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ వెంకట్రావు తెలిపారు.