ఆకివీడులోని సమతా నగర్ బ్రాందీ షాపు వద్ద పెద్దిరాజు అనే వ్యక్తితో జరిగిన ఘర్షణను ఆపడానికి ప్రయత్నించిన గండేటి మణికంఠపై పెద్దిరాజు పగిలిన సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్ఐ సత్యనారాయణ ఈ వివరాలను తెలిపారు.