ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఉండి ఎస్సై నసీరుల్లా సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి 12,500 రూపాయల నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.