జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్న దేవాలయ అధికారులను అభినందించారు. ఆదివారం ద్వారకాతిరుమలలోని గోశాలను, బయో గ్యాస్ ప్లాంట్ వినియోగాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవాలయంలో గోవర్ధన ప్రాజెక్ట్ లో భాగంగా 1 టిపిడి సామర్థ్యం కలిగిన బయో గ్యాస్ ప్లాంట్ ను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ చర్యలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.