అంతరించిపోతున్న పక్షుల్లో కలివికోడి ఒకటి. ఈ పక్షిని 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో తొలిసారిగా చూశారు. 1985, 1998, దీని జాడ కనుగొనే ప్రయత్నాలు జరిగాయి. తాజాగా కడప జిల్లాలోని చిట్టడవుల్లో ఈ పక్షి వున్నట్లు సమాచారం. దీంతో 3 వేల ఎకరాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని ఆచూకీ కోసం 50 కోట్లు ఖర్చు చేశాయి. గత నెలలో దీని కూతను రికార్డ్ చేశారు. ఇది ఎగరలేదు కూతపెడితే సుమారు 200 మీటర్ల వరకూ వినిపిస్తుంది.