AP: తన కొడుకు రాజకీయాల్లోకి రాకముదే వైసీపీ భయపడుతోందని వైఎస్ షర్మిల అన్నారు. తన కొడుకు అంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. తన కుమారుడికి రాజారెడ్డి అని పేరుపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని షర్మిల అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా తన కొడుకు వైఎస్ వారసుడేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అని, అందుకే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు.