AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన తెలిపారు. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ సమీప గ్రామాల్లోని వేల ఎకరాల కొబ్బరి చెట్లు పాడైపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే దసరా పండుగ తర్వాత తాను రైతులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలిస్తానని పవన్ చెప్పారు. వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించి ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని తెలిపారు.