AP: 2024 ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేసి కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు. ఇక చూస్తే కనుక ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ తరఫున సీఎం గా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడే రామ్ కుమార్ రెడ్డి. ఆయన దూకుడుగా రాజకీయం చేయలేకపోతున్నారని ఆయన స్థానంలో మరొకరిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్కడి వెంకటగిరి రాజా కుటుంబం మీద వైసీపీ ఫోకస్ ఉంది అని అంటున్నారు. అలాగే టీడీపీకి పోటీ ఇచ్చి ఓడించాలంటే నేదురుమల్లి మార్పు అవసరం అని సమాచారం.